News June 17, 2024

ఫైనల్లో ఓడిన సుమిత్ నగల్

image

భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ పెరుజియా ఛాలెంజ్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. ఇటలీ ప్లేయర్ లూసియానతో జరిగిన తుది పోరులో 6-1, 6-2 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. గంట వ్యవధిలోనే మ్యాచ్ పూర్తవ్వడం గమనార్హం. ఈ పరాజయంతో ఈ ఏడాది మూడో టైటిల్‌ వేటలో సుమిత్ విఫలమయ్యారు.

Similar News

News March 16, 2026

SRH కెప్టెన్‌గా అభిషేక్ శర్మ!

image

IPL: సన్‌రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఆయన స్థానంలో ఓపెనింగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు అంచనా వేస్తున్నాయి. వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్ T20WCలో సైతం ఆడలేదు. పూర్తిగా కోలుకోవడానికి మరో 2 నుంచి 3 వారాలు పట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

News March 16, 2026

W.బెంగాల్.. 144 మంది అభ్యర్థులను ప్రకటించిన BJP

image

WB అసెంబ్లీ ఎన్నికల వేళ BJP 144 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపూర్ నుంచి ప్రతిపక్షనేత సువేందు అధికారిని బరిలో దించింది. నందిగ్రామ్‌లోనూ ఆయనే పోటీ చేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో APR 23, 29వ తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు కేరళంలోనూ 47 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను BJP ప్రకటించింది.

News March 16, 2026

శుక్రుడు మరీ ఇంత స్లోనా?

image

సౌర కుటుంబంలో అత్యంత వింతైన గ్రహం శుక్రుడు. సాధారణంగా గ్రహాలకు తమ చుట్టూ తాము తిరగడానికి పట్టే సమయం(రోజు) కంటే, సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం (సంవత్సరం) ఎక్కువ. కానీ శుక్ర గ్రహం తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. అందుకే అక్కడ ఒక రోజు(243d) గడవకముందే ఒక సంవత్సరం(225d) పూర్తవుతుంది. ఈ కాలగమనం ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో