News March 2, 2025
వేసవి అలర్ట్.. విద్యార్థులు జాగ్రత్త

వేసవి మెుదలవటంతో పరీక్షలు రాసే విద్యార్థులు వడదెబ్బ తాకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 7-8గంటలు నిద్రపోవాలని, కొబ్బరినీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకోవాలని చెబుతున్నారు. పరీక్ష గదిలోకి వాటర్‌బాటిల్ తీసుకెళ్లాలని, ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు లేదా క్యాప్ తప్పనిసరిగా వాడాలని అంటున్నారు. తేలికపాటి లేత రంగు దుస్తులు ధరించటం ఉత్తమమని సూచిస్తున్నారు.
Similar News
News January 13, 2026
2027 ఎన్నికల్లో UP సీఎం అభ్యర్థిగా ప్రియాంక?

INC ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ UP రాజకీయాల్లో మళ్లీ కేంద్రబిందువుగా మారారు. నిన్న ఆమె 54వ పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. BCలను ఆకర్షించేలా పరివర్తన్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని UPCC చేపట్టింది. దీంతో 2027 UP అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ CM అభ్యర్థిగా ప్రియాంక ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. ఆమె నేతృత్వంలో అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.
News January 13, 2026
ఇండియాలో ఆడబోం.. ICCకి స్పష్టం చేసిన బంగ్లా

టీ20 వరల్డ్‌కప్ మ్యాచులను ఇండియాలో <<18761652>>ఆడబోమని<<>> బంగ్లాదేశ్ మరోసారి స్పష్టం చేసింది. తమ ప్లేయర్ల భద్రత దృష్ట్యా వేరే దేశంలో మ్యాచులు నిర్వహించాలని కోరింది. ఇవాళ ICCతో బంగ్లా బోర్డు వర్చువల్‌గా సమావేశమైంది. టోర్నమెంట్ షెడ్యూలు, ప్రయాణ ప్లాన్ ఇప్పటికే ఖరారైందని, దీనిపై పునరాలోచించాలని ICC కోరింది. కానీ BCB ఒప్పుకోలేదు. దీంతో ఏకాభిప్రాయం కోసం చర్చలను కొనసాగించాలని బోర్డులు అంగీకరించాయి.
News January 13, 2026
సంక్రాంతి రోజున అస్సలు చేయకూడని పనులివే..

సంక్రాంతి పర్వదినాన స్నానం చేసాకే ఆహారం తీసుకోవాలి. ప్రకృతిని ఆరాధించే పండుగ కాబట్టి చెట్లు, మొక్కలను నరకకూడదు. మద్యం, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలు తీసుకోకూడదు. ఇంటికి వచ్చిన సాధువులు, పేదలను ఖాళీ చేతులతో పంపకూడదు. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. సాయంత్రం వేళ నిద్రించకూడదని పండితులు చెబుతారు. ఈ నియమాలు పాటిస్తే శుభం కలుగుతుందని నమ్మకం.


