News May 24, 2024
Summer: కూరగాయలు, పండ్లు పాడవుతున్నాయా?

* కూరగాయలను నేరుగా వేడి తాకే ప్రదేశంలో పెట్టవద్దు.
* ఫ్రిజ్ టెంపరేచర్ 4°C లేదా అంతకంటే తక్కువే ఉంచాలి.
* ఫ్రిజ్ అంతా సరుకులతో నింపకుండా గాలి తాకేలా స్పేస్ ఉంచాలి.
* అరటి, యాపిల్, టమాటా, అవకాడో లాంటి పండ్లు, కూరగాయలు ఇథలిన్ను విడుదల చేస్తాయి. వాటి వల్ల మిగిలినవీ త్వరగా పండుతాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని వేర్వేరుగా ఉంచాలి.
* త్వరగా పాడయ్యే వాటిని ముందు వాడుకోవడం ఉత్తమం.
Similar News
News October 29, 2025
తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.
News October 29, 2025
నేను చిరు మూవీలో నటించట్లేదు: మాళవిక

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని హీరోయిన్ మాళవికా మోహనన్ ఖండించారు. ‘ఏదో ఒకరోజు చిరంజీవి సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది. అయితే మెగా158లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో ఈ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News October 29, 2025
అజహరుద్దీన్కు మంత్రి పదవి

ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్, ఆయన కుమారుడు అసదుద్దీన్తో భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. MLCగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది.


