News May 4, 2024
పోలింగ్‌పై సమ్మర్ ఎఫెక్ట్?

AP: గడచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి నమోదవుతున్నాయి. పోలింగ్ తేదీ అయిన మే 13 నాటికి వేసవి పరాకాష్ఠకు చేరే ఛాన్స్ ఉంది. ఈ ఉక్కపోతలో ప్రజలు ఓపిగ్గా వచ్చి ఓటేస్తారా అన్నది ఆసక్తికరం. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటేసే సదుపాయం ఉన్నా కేవలం 3శాతం మంది మాత్రమే దానిని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో సమ్మర్ ఎఫెక్ట్ ఏమేరకు ఉంటుందోనన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది.
Similar News
News November 12, 2025
CMగా తేజస్వీ వైపే ప్రజల మొగ్గు: Axis My India

బిహార్‌లో ఎన్డీయే గెలుస్తుందని Axis My India <<18269672>>ఎగ్జిట్ పోల్<<>> సర్వే అంచనా వేసింది. అయితే CMగా ఎవరైతే బెటర్ అనే విషయంలో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కంటే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వైపే ఎక్కువ మంది మొగ్గుచూపినట్లు తెలిపింది. తేజస్వీకి 34%, నితీశ్‌కు 22% మంది మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. బీజేపీ అభ్యర్థికి 14%, చిరాగ్ పాస్వాన్‌కు 5% మంది సపోర్ట్ చేయడం గమనార్హం.
News November 12, 2025
ఒక్కో అంతస్తు ఎన్ని అడుగులు ఉండాలి?

ఇంటి నిర్మాణంలో ఒక్కో అంతస్తు ఎత్తు కనీసం 10.5 నుంచి 12 అడుగుల మధ్య ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ కొలత పాటించడం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయంటున్నారు. ‘ఇది ఇంట్లో ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచి, నివాసితులకు ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తక్కువ ఎత్తు ఉన్న అంతస్తులు నిరుత్సాహాన్ని, ఇరుకుతనాన్ని కలిగిస్తాయి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 12, 2025
విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా: ధర్మారెడ్డి

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్నూ విచారించారు’ అని మీడియాకు తెలిపారు.


