News April 7, 2025
సమ్మర్ ఎఫెక్ట్.. ధరలు రెట్టింపు

AP: ఎండలు పెరుగుతుండటంతో నిమ్మకాయ ధరలు రెట్టింపయ్యాయి. గత నెలలో క్వింటా రూ.6 వేల వరకూ ఉండగా ప్రస్తుతం రూ.12వేలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా వేసవిలోనే 4 లక్షల టన్నులు ఉంది. మరోవైపు మార్కెట్లో కాయ సైజును బట్టి ఒక్కోటి రూ.5-10 వరకు అమ్ముతున్నారు.
Similar News
News April 14, 2025
కాంగ్రెస్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా: రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ భర్త అయినందునే ఇంతకాలం రాజకీయ చర్చల్లో తనపై విమర్శలు చేసేవారన్నారు. రాహుల్, ప్రియాంకలను చూసి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత తరుణంలో, పార్లమెంట్లో పోరాడటానికి మరిన్ని గొంతుకలు కావాలని రాబర్ట్ వాద్రా అభిప్రాయపడ్డారు.
News April 14, 2025
డోస్ పెంచిన ఆశావహులు

TG: మంత్రిపదవుల ఆశావహులు డోస్ పెంచి గళం విన్పిస్తున్నారు. HYD, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ నేతనైన తనకు పదవి దక్కాలని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అటు ప్రజల కోసం తపించే తాను మంత్రి పదవికి అర్హుడినని రాజగోపాల్ అన్నారు. అయితే జానారెడ్డి లాంటివారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక తనకు మినిస్ట్రీ రాకుంటే మంచిర్యాలను ముంచినట్లే అని స్థానిక నేత ప్రేమ్ సాగర్ ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.
News April 14, 2025
ఇంగ్లిష్ పుస్తకాలకు హిందీ పేర్లు.. NCERT వివాదాస్పద నిర్ణయం

ఇంగ్లిష్ పుస్తకాలకు NCERT హిందీ పేర్లు పెట్టడం వివాదాస్పదమైంది. గతంలో 6వ తరగతి టెక్ట్స్బుక్ పేరు ఇంగ్లిష్లో ‘Honeysuckle’ అని ఉండగా హిందీలో ‘పూర్వీ’ అని మార్చింది. ఇది సంగీత రాగం పేరు. 1,2 తరగతుల పుస్తకాలకు మృదంగ్, 3rd క్లాస్ బుక్స్కు సంతూర్ అని పేర్లు పెట్టింది. ఇవి సంగీత పరికరాలు. తమిళనాడు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ NCERT పేర్లను మార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.