News February 6, 2025
ఎండాకాలం వచ్చేసింది
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి వేడి పెరిగింది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మంగళవారం రికార్డు స్థాయిలో 15,582 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది అదేరోజు 13,276 మెగావాట్ల వినియోగం నమోదవడం గమనార్హం. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు ఉంటున్నాయి. మరో వారంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Similar News
News February 6, 2025
కాంగ్రెస్ రాకతో పాత కష్టాలు: కేటీఆర్
TG: రాష్ట్ర సచివాలయంలోనే కాదు గ్రామ సచివాలయాల్లోనూ పాలన పడకేసిందని మాజీ మంత్రి కేటీఆర్ Xలో విమర్శించారు. గ్రామాలన్నీ సమస్యల ఊబిలో చిక్కుకున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, కాంగ్రెస్ వచ్చి పాత కష్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. సీఎం ఇకనైనా మొద్దునిద్ర వీడాలని, గ్రామాల్లో సమస్యల పంచాయితీని తేల్చాలని రాసుకొచ్చారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
News February 6, 2025
నర్సు నిర్వాకం.. గాయానికి కుట్లకు బదులు పెవిక్విక్
మనకు ఏదైనా గాయమైతే వైద్యులు కుట్లు వేస్తారు. అయితే కర్ణాటక హవేరి(D)లోని అడూర్ PHCలో స్టాఫ్ నర్స్ జ్యోతి ఫెవిక్విక్‌తో చికిత్స చేసింది. ఏడేళ్ల బాలుడి చెంపకు గాయమవడంతో పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నర్సు గాయానికి కుట్లు వేస్తే మచ్చలు పడతాయని చెప్పి ఫెవిక్విక్ రాసి బ్యాండేజ్ వేసింది. పేరెంట్స్ అభ్యంతరం చెప్పినా వినలేదు. ఈ ఘటనపై వారు చేసిన ఫిర్యాదుతో అధికారులు నర్సును సస్పెండ్ చేశారు.
News February 6, 2025
బంగ్లా పితామహుడి ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్ పితామహుడిగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని బంగ్లా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. దేశంలోని తమ అవామీ లీగ్ కార్యకర్తలందరూ ఏకమై మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై తిరగబడాలని మాజీ ప్రధాని హసీనా ఆన్‌లైన్ వీడియోలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి, బంగబంధు రెహమాన్ భవనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.