News April 18, 2025
SUMMER HOLIDAYS.. కామారెడ్డి జిల్లాకు స్వాగతం!

వేసవి సెలవులు షురూ కావడంతో, ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా? ప్రకృతి రమణీయత, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు కామారెడ్డి జిల్లాలో అనేకం ఉన్నాయి. దోమకొండ కోట, నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, నాగన్న బావి, తెలంగాణ తిరుమల, కాలభైరవ స్వామి, సిద్ధ రామేశ్వర స్వామి, షిర్డీ సాయిబాబా ఆలయాలున్నాయి. ఈ అందమైన ప్రదేశాలను సందర్శించి మరపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకోండి!
Similar News
News April 19, 2025
ఆదిలాబాద్: డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III.V సెమిస్టర్‌ల (బ్యాక్ లాగ్) పరీక్షలు వాయిదా వేశామని, మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News April 19, 2025
NZB: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం: కలెక్టర్

భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ రైతుల భూములకు పూర్తి భరోసా కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భూ భారతిపై శనివారం వర్ని , రుద్రూర్ రైతు వేదికలలో అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ప్రజల కోసం ప్రత్యేకించి రైతులకు వారి భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు.
News April 19, 2025
బాపట్ల: ఉద్యోగాల పేరిట రూ.1.5కోట్ల వసూలు.. మోసగాడి అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసి రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసిన వ్యక్తిని తెనాలి త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమరావతి కాలనీకి చెందిన తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటేరియట్‌లో ఏఎస్ఓగా పని చేస్తున్నానంటూ ఫేక్ ఐడీలతో నమ్మించి ఉద్యోగాలు పేరిట మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.1.5 కోట్లు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.