News May 7, 2025

ఎండలు, వడగాలులు.. బయటికెళ్లొద్దు!

image

తెలుగు రాష్ట్రాల్లో 40-44 డిగ్రీల ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. TGలో 2 రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో <>వడగాలులు వీస్తాయని<<>> తెలిపింది.
* మధ్యాహ్నం వేళ్లలో బయటికి వెళ్లకపోవడం మంచిది.

Similar News

News March 19, 2026

పిల్లలు తనకు పుట్టలేదన్న భర్త.. DNA టెస్టుకు కోర్టు నిరాకరణ

image

AP: భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించడానికి తన ఇద్దరు పిల్లలకు DNA పరీక్ష నిర్వహించాలంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న వాదనను తోసిపుచ్చింది. ఇది పిల్లల గౌరవానికి సంబంధించిన అంశమని, బలమైన కారణం లేకుండా DNA టెస్టుకు ఆదేశించలేమని తేల్చి చెప్పింది. భార్య తనను విడిచి వెళ్లిందని తొలుత భర్త విడాకుల పిటిషన్ వేశారని, అక్రమ సంబంధం గురించి కాదని పేర్కొంది.

News March 19, 2026

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

image

సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని పేర్కొంటున్నారు.

News March 19, 2026

BREAKING: జాబ్ క్యాలెండర్ విడుదల

image

AP: 10,060 పోస్టులతో మంత్రి లోకేశ్ <<19422647>>జాబ్ క్యాలెండర్<<>> విడుదల చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉద్యోగార్థులందరూ ‘<>నైపుణ్యం<<>>’ పోర్టల్‌లో ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ చేసుకోవాలని సూచించారు. ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన ఉంటుందని వెల్లడించారు.