News June 1, 2024
ఎండ.. వర్షం.. మంచు

దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ, హరియాణా, తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండగా.. భారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో విపరీతమైన మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దేశంలో ఈ భిన్న వాతావరణంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మన సంస్కృతిలా ప్రకృతిలో వైవిధ్యం ఇదేనంటూ కామెంట్ చేస్తున్నారు.
Similar News
News April 9, 2026
దాహమేస్తోందని అడగలేవు.. మనమే దప్పిక తీరుద్దాం!

ఎండాకాలంలో జంతువులు నీడ, నీరు లేక అల్లాడిపోతాయి. దాహమేస్తోందని అడగలేవు కూడా. అందుకే వాటి బాధను మనం అర్థం చేసుకుందాం. ఇందుకోసం మీరు చేయాల్సింది ఇంటి ముందర చిన్న తొట్టె లేదా బకెట్లో నీళ్లు నింపి పెట్టడమే. మండే ఎండల్లో దాహంతో ఉన్న పక్షులు, జంతువులు ఆ నీటితో కడుపు నింపుకుంటాయి.
Share It
News April 9, 2026
పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయ్: కేంద్రం

శబరిమలలోకి 10-50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఆంక్షలను కేంద్రం సమర్థించింది. ఇది వివక్ష కాదని, దశాబ్దాలుగా కొనసాగుతున్న <<19599264>>ఆచారాన్ని<<>> గౌరవించడమేనని తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ వాదనలు వినిపించారు. దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇది పురుషాధిక్య/ స్త్రీ ఆధారిత విశ్వాసాలకు సంబంధించింది కాదన్నారు.
News April 9, 2026
చిన్న సినిమా రూ.100 కోట్లు కొల్లగొట్టింది!

మరో మలయాళం సినిమా అదరగొట్టింది. నవీన్ SA దర్శకత్వం వహించిన వజా-2 మూవీ 10 రోజుల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టింది. స్కూల్లో వేస్ట్ బ్యాచ్‌గా పేరు తెచ్చుకున్న నలుగురు కుర్రాళ్లు జీవితంలో సెటిల్ కావడానికి ఎలా కష్టపడ్డారనేదే ఈ చిత్ర కథ. సింపుల్ ఎమోషన్స్, క్లీన్ కామెడీ, అనుబంధాలతో డైరెక్టర్ చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌కూ పెద్దపీట వేశారు. మూవీ బడ్జెట్ రూ.5-10 కోట్లు.


