News May 21, 2024

ఈ రాష్ట్రాల్లో ఎండల మంటలు తప్పవు: వాతావరణ శాఖ

image

వర్షాలకు ముందుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పుడు పర్వాలేదనే చెప్పాలి. కానీ ఉత్తర భారత్‌లోని పంజాబ్, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, గుజరాత్, ఎంపీ రాష్ట్రాల్లో ఎండల మంటలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ రాష్ట్రాల ప్రజలతో పాటు అక్కడికి ప్రయాణించేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈరోజు సైతం ఆయా రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.

Similar News

News October 25, 2025

అన్ని కార్తెలు తప్పినా హస్త తప్పదు

image

కార్తెల(నక్షత్రాలు) ప్రకారం రైతులు వర్షాన్ని అంచనా వేసేవారు. వర్షం కురిసే సీజన్‌కు సంబంధించిన అన్ని కార్తెలు తప్పిపోయినా, హస్త సమయంలో వర్షం తప్పకుండా పడుతుంది అనే నమ్మకాన్ని ఇది సూచిస్తుంది. సీజన్‌లో కురవాల్సిన వాన మిగతా కార్తెల్లో పడకపోయినా హస్తలో కచ్చితంగా పడుతుందని ఓ నమ్మకం. అందుకే రైతులు ఆ సందర్భంలో ఈ సామెతను వాడుతుంటారు.
(మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి)

News October 25, 2025

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఖర్గేతో భేటీ!

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ చీఫ్ ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలపై అధిష్ఠానం సీఎం అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రుల మధ్య విభేదాలు, అంతర్గత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశముంది.

News October 25, 2025

డిసెంబర్ కల్లా గ్రేటర్ తిరుపతి!

image

AP: గ్రేటర్ తిరుపతికి అడుగులు పడుతున్నాయి. నిన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గ్రేటర్ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. డిసెంబర్ కల్లా గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో కలెక్టర్ విలీన ప్రతిపాదనలను GP కార్యదర్శులకు పంపించారు. కాగా తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు పరిధిలోని 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేయనున్నారు.