News October 20, 2024

టెస్టు జట్టులోకి సుందర్ రీఎంట్రీ

image

న్యూజిలాండ్‌తో జరిగే మిగతా రెండు టెస్టులకు స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రెండో టెస్టుకు ముందు అతను జట్టులో చేరతారని తెలిపింది. తాజాగా రంజీ ట్రోఫీలో సుందర్ సెంచరీతో రాణించారు. కాగా ఈనెల 24 నుంచి పుణే వేదికగా రెండో టెస్టు, నవంబర్ 1 నుంచి ముంబైలో మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో NZ <<14405398>>విజయం<<>> సాధించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 3, 2025

నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు

image

ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు HYDలోని హైటెక్స్‌లో జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సభలను ప్రారంభించనున్నారు. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఎల్లుండి ముగింపు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

News January 3, 2025

నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు, అల్లు అర్జున్‌కు సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News January 3, 2025

రైలు పట్టాలపై పబ్‌జీ.. ముగ్గురు యువకుల మ‌ృతి

image

పబ్‌జీ ఆట పిచ్చి బిహార్‌లో ముగ్గురు టీనేజీ యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్‌జీ ఆడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. వారిపైనుంచి రైలు వెళ్లిపోయింది. దీంతో అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.