News March 23, 2025

SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

image

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.

Similar News

News December 7, 2025

తూప్రాన్: ‘కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇయ్యండి’

image

పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఓ అభ్యర్థి కాళ్లు పట్టి వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి తూప్రాన్ ఐడీఓసీ భవనంలో గుర్తుల కేటాయింపు సమయంలో చోటుచేసుకుంది. ఇస్లాంపూర్(తూప్రాన్) సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. బీఆర్ఎస్‌లో చేరిన స్వతంత్ర అభ్యర్ధి బీములు కాంగ్రెస్ నాయకుడి కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు.

News December 7, 2025

సర్పంచ్ ఎన్నికలు.. పెద్దపల్లి జిల్లాలో సెలవులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీల సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సెలవులు ప్రకటించారు. మూడు దశల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, దశ-I (డిసెంబర్ 11) పోలింగ్‌కు డిసెంబర్ 10, 11 తేదీల్లో సెలవు ఉంటుంది. అలాగే, దశ-III (డిసెంబర్ 17) పోలింగ్‌కు డిసెంబర్ 16, 17 తేదీలను స్థానిక సెలవులుగా ప్రకటించారు. దశ-II (డిసెంబర్ 14) పోలింగ్ రోజున ఇప్పటికే ప్రభుత్వ సెలవులు ఉండడంతో, అదనంగా ప్రకటన చేయలేదు.

News December 7, 2025

ఇండిగో సంక్షోభం: గుత్తాధిపత్యమే ముంచిందా?

image

దేశంలో విమానయాన సంక్షోభానికి ఇండిగో గుత్తాధిపత్యమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండిగో(63%), ఎయిరిండియా(20%) తప్ప మిగతా సంస్థల వాటా నామమాత్రమే. కానీ 2014లో ఇండిగో(31.8%), జెట్ ఎయిర్‌వేస్(21.7%), ఎయిరిండియా(18.4%), స్పైస్ జెట్(17.4%), గో ఎయిర్(9.2%) ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు ఇండిగోలో సిబ్బంది కొరతతో పరిస్థితి తీవ్రమైంది. అదే మరిన్ని సంస్థలు ఉంటే ఇలా జరిగేది కాదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.