News March 2, 2025
SUNDAY: HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. తలకాయ కాళ్లు, బోటీకి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.
Similar News
News January 9, 2026
HYD: రాహుల్ సిప్లిగంజ్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్న ‘కల్ట్’ వెబ్ సిరీస్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కోర్టు విచారణలో ఉన్న మదనపల్లి చిన్నారుల హత్య కేసు ఆధారంగా తప్పుడు కథతో వెబ్ సిరీస్ నిర్మించి ఈ నెల 17న విడుదలకు ప్రయత్నించడం సరికాదని పిటిషనర్ ఉత్తం వల్లూరి చౌదరి తెలిపారు. ఇది తమ పరువు ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేసును అడ్వకేట్ రామారావు ఇమ్మానేని వాదిస్తున్నారు.
News January 9, 2026
HYD: 2 రోజులు వాటర్ బంద్

నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం సా.6 వరకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.
News January 9, 2026
HYD: రూ.40K సాలరీతో ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) కాంట్రాక్టు పద్ధతిలో HYDలో ప్రాజెక్ట్ ఇంజినీర్లను నియమించనుంది. B.Tech/ B.E పూర్తి చేసి, 3ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. నెలకు ₹40,000 జీతంతో ఏడాది కాంట్రాక్టుతో ప్రారంభమై, 4 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. దరఖాస్తులు జనవరి 6- 20 వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు <


