News March 23, 2025

SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

image

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.

Similar News

News November 8, 2025

HYD: పార్కు కాదు.. పచ్చని డంపింగ్ యార్డు

image

డంపింగ్‌ యార్డ్‌ అనగానే చెత్త, చెదారంతో నిండిన దుర్వాసన గూడు గుర్తుకువస్తుంది. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్‌ డంపింగ్‌ యార్డ్‌ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తోంది. చెత్త మాయమై, పచ్చదనం పరచుకుంది. పచ్చిక బయళ్లు, ఓపెన్‌ జిమ్‌లు అలరారుతున్నాయి. ‘ఇది డంపింగ్‌ యార్డా? లేక పార్కా?’ అనే అనుమానం కలిగిస్తోంది.

News November 8, 2025

HYD: ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ

image

నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, హెల్త్ సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎ.విమలా రెడ్డి తెలిపారు. ఫైర్, ఇండస్ట్రీయల్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎన్విరాన్‌మెంట్ కోర్సులో మాస్టర్ డిప్లొమాలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

News November 8, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: రేపు సాయంత్రం నుంచి ప్రచారం బంద్

image

జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. EC నిబంధనల ప్రకారం సాయంత్రం తర్వాత మైకులు బంద్ చేయాలి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ కూడా మూతబడనున్నాయి. నవంబర్ 11న పోలింగ్ ఉండడంతో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గెలుపు ఓటముల్లో పోల్ మేనేజ్‌మెంట్ కీలకం కానుంది.