News March 23, 2025
SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.
Similar News
News July 6, 2025
మాలిలో మాచర్ల యువకుడు కిడ్నాప్.. విదేశాంగ శాఖకు లేఖ

మాలిలో మాచర్లకు చెందిన అమరలింగేశ్వరరావును<<16955422>> ఉగ్రవాదులు<<>> కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. జులై 1న ఏస్ నగరంలోని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉగ్రవాదులు అమరలింగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేశారు. అమరలింగేశ్వరరావు 11 ఏళ్లుగా మాలిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్యాబిడ్డలు HYDలో ఉంటున్నారు. తమ కుమారుడిని విడిపించాలని కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలువగా ఆయన విదేశాంగ శాఖకు లేఖ రాశారు.
News July 6, 2025
వడమాలపేట: TTDలో ఉద్యోగాల పేరుతో మోసం

వడమాలపేట మండలం అమ్మగుంట హరిజనవాడకు చెందిన పులి శేఖర్ అనే వ్యక్తి TTDలో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నాడు. అతనితోపాటు డిగ్రీ చదివిన వారికి ఫోన్ చేసి TTDలో ఉద్యోగాలు అంటూ ఆశ చూపి వేలుకు వేలు తీసుకుని ముఖం చాటేస్తున్నాడని బాధితులు వాపోయారు.
News July 6, 2025
148 ఏళ్లలో తొలిసారి.. చరిత్ర సృష్టించాడు

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పరుగుల వరద పారించిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ <<16956685>>రికార్డుల<<>> మోత మోగించారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో 250 ప్లస్, 150 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా ఆయన ఖ్యాతి గడించారు. గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, శతకం బాదిన తొలి ప్లేయర్‌గానూ అతడు రికార్డులకెక్కారు.