News March 2, 2025

SUNDAY: HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

image

భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. తలకాయ కాళ్లు, బోటీకి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Similar News

News November 7, 2025

రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ(SSMB29) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను జక్కన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తిమంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’(పృథ్వీ క్యారెక్టర్ పేరు)కు ప్రాణం పోయడం సంతృప్తికరం’’ అని రాసుకొచ్చారు.

News November 7, 2025

డిజిటల్ సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

తూ.గో. జిల్లా వ్యాప్తంగా ‘మన మిత్ర’ వాట్సాప్‌ ఆధారిత సేవలపై శుక్రవారం నుంచి డోర్‌ టు డోర్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సాప్‌ సేవల డెమో, క్యూఆర్‌ కోడ్‌ పంపిణీ, పాంప్లెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ప్రతి ఇంటిని కవర్‌ చేసి, నమోదు అయిన కుటుంబాల వివరాలను రికార్డు చేయాలని కలెక్టర్‌ సూచించారు.

News November 7, 2025

రాజన్న ఆలయం పడమరవైపు గేటు మూసివేత

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం పడమరవైపు గేటును మూసివేశారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో రాజన్న ఆలయంలో సాధారణ దర్శనాలు కొనసాగిస్తున్న అధికారులు అన్నిరకాల ఆర్జిత సేవలను భీమేశ్వరాలయానికి మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పడమరవైపు స్వాగత ద్వారానికి అడ్డంగా రేకులను అమర్చారు. పీఆర్‌ఓ కార్యాలయ మార్గం నుంచి ఆలయంలోపలికి వెళ్లకుండా అక్కడ కూడా రేకులను అడ్డుగాపెట్టి రాకపోకలను నిలిపివేశారు.