News March 2, 2025
SUNDAY: HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. తలకాయ కాళ్లు, బోటీకి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.
Similar News
News March 3, 2025
HYD: ‘కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి’

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోని జరుగుతుందన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు.
News March 3, 2025
HYD: 18 ఏళ్లు నిండకముందే పెళ్లి పీటల పైకి..!

HYD, RR,MDCL జిల్లాలో 18 ఏళ్లు నిండకముందే బాలికలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. బాల్య వివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పిల్లలకు త్వరగా పెళ్లి చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని తల్లిదండ్రులు ఉన్నారు. బాల్య వివాహాల రద్దు కోసం ప్రభుత్వాలు బలమైన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ వారికి శాపంగా మారుతుంది. మేడ్చల్‌లో 54, HYDలో 46, రంగారెడ్డిలో 54 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు.
News March 3, 2025
నేరాలపై సైబరాబాద్ పోలీసులు ఫోకస్

CYB కమిషనరేట్ పరిధి 510 ప్రాంతాల్లో శనివారం DCPల ఆధ్వర్యంలో రైడ్స్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్న 380 మందిని అదుపులోకి తీసుకోగా.. గంజాయి తాగుతున్న14 మందిని పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా కేసులు 1, వ్యభిచారం 26, నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులపై2, బహిరంగ ప్రదేశాల్లో మందు తాగిన ఘటనలో 15 కేసులు, న్యూసెన్స్ 57, నంబర్ ప్లేట్ లేని 18 వాహనాలపై కేసులు నమోదు కాగా 4 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు.