News November 24, 2024

SUNDAY SPECIAL.. ఆకట్టుకుంటున్న వరంగల్ రీజినల్ లైబ్రరీ

image

వరంగల్‌లో రీజినల్ లైబ్రరీ నగరవాసులను ఆకట్టుకుంటోంది. గత ప్రభుత్వంలో ఈ లైబ్రరీని ఆధునికీకరించారు. ఫర్నిచర్, ఇంటర్నెట్, వైఫైతో పాటు.. దాదాపు బుక్స్ అన్నింటినీ డిజిటలైజేషన్ చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అంతేకాదు, రోడ్డుపై వెళ్తుంటే లైబ్రరీ గోడపై రంగులతో దిద్దిన ఓ బాలిక చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఈ లైబ్రరీని చూసి ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News November 20, 2025

సీఎం సహాయనిది పేదలకు ఒక వరం: ఎంపీ కావ్య

image

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిది ఒక వరమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎంపీ CMRF చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మందికి రూ.6 లక్షల 25 వేల విలువైన చెక్కులను అందజేశారు.

News November 19, 2025

వరంగల్ కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి అభినందనలు

image

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.

News November 19, 2025

పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

image

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ పంపిణీని పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9లోగా, పట్టణాల్లో మార్చి 1-8 మధ్య పంపిణీ పూర్తి చేయాలని సీఎం సూచించారు.