News November 24, 2024
SUNDAY SPECIAL.. ఆకట్టుకుంటున్న వరంగల్ రీజినల్ లైబ్రరీ
వరంగల్‌లో రీజినల్ లైబ్రరీ నగరవాసులను ఆకట్టుకుంటోంది. గత ప్రభుత్వంలో ఈ లైబ్రరీని ఆధునికీకరించారు. ఫర్నిచర్, ఇంటర్నెట్, వైఫైతో పాటు.. దాదాపు బుక్స్ అన్నింటినీ డిజిటలైజేషన్ చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అంతేకాదు, రోడ్డుపై వెళ్తుంటే లైబ్రరీ గోడపై రంగులతో దిద్దిన ఓ బాలిక చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఈ లైబ్రరీని చూసి ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News December 14, 2024
గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జనగామ కలెక్టర్
జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, మెడికల్ కిట్, బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలను పర్యవేక్షించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. తరగతి గదుల్లోని బెంచీలపై అతికించిన హాల్ టికెట్ నంబర్లను అత్యంత జాగ్రత్తగా, సక్రమంగా ఉండాలని సూచించారు.
News December 14, 2024
వసతి గృహాలను సందర్శించిన ఎమ్మెల్యే నాయిని
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన, నాణ్యతపరమైన భోజన సదుపాయాలను ప్రజా ప్రభుత్వం కల్పిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట 63వ డివిజన్ బిసి బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
News December 14, 2024
వరంగల్: విషాదం.. రేపు పెళ్లి.. వరుడి తల్లి మృతి
గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. WGL కాశిబుగ్గకు చెందిన గుర్రపు రజిని- సమ్మయ్య దంపతుల కుమారుడి వివాహం ఆదివారం జరగనుంది. కాగా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న రజినికి శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా గుండెపోటు వచ్చి తనువు చాలించింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.