News March 25, 2025

OTTలోకి సందీప్ కిషన్ ‘మజాకా’

image

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ‘మజాకా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఉగాది కానుకగా ఈ నెల 28 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ మూవీలో ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా గత నెల 26న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

Similar News

News November 26, 2025

ఏడాదికి లక్ష మంది అగ్నివీర్‌ల నియామకానికి ప్లాన్!

image

రాబోయే 4 ఏళ్లలో ఏడాదికి లక్ష మంది అగ్నివీర్‌లను నియమించుకోవాలని ఆర్మీ ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా 1.8 లక్షలుగా ఉన్న సైనిక కొరతను అధిగమించాలని భావిస్తోంది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 2022 నుంచి ప్రతి ఏడాది 45వేల నుంచి 50వేల మంది అగ్నివీర్‌లను ఆర్మీ నియమిస్తోంది. కరోనా కారణంగా 2020, 21లో రిక్రూట్‌మెంట్లు నిలిపివేయడం, అప్పుడే ఏడాదికి 60వేల నుంచి 65వేల మంది రిటైర్ కావడంతో సైనికుల కొరత ఏర్పడింది.

News November 26, 2025

3,058 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి NOV 29 వరకు ఛాన్స్ ఉంది. వయసు18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. www.rrbcdg.gov.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 26, 2025

110 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

SEBIలో 110 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ / PG డిప్లొమా, LLB, BE, బీటెక్, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. ఫేజ్ 1 రాత పరీక్ష JAN 10న, ఫేజ్ 2 రాత పరీక్ష FEB 21న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,ST, PwBDలకు రూ.100. వెబ్‌సైట్: sebi.gov.in