News April 18, 2024
సునీల్ నరైన్ సంచలన నిర్ణయం?

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తిరిగి జాతీయ జట్టుకు ఆడేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీ20 WCలో ఆడాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నరైన్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా నరైన్ ఈ ఐపీఎల్ సీజన్లో దుమ్మురేపుతున్నారు. 276 పరుగులతోపాటు 7 వికెట్లు పడగొట్టారు.
Similar News
News November 20, 2025
వయసు పెరుగుతున్నా.. తగ్గేదేలే!

తెలుగు హీరోలు మహేశ్(50), నాగార్జున(66) సహా పలువురు నటులు వయసు పెరిగే కొద్దీ మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారి ముఖాల్లో ఏమాత్రం వృద్ధాప్య ఛాయలు కనిపించకపోవడం ‘వయసు వెనక్కి వెళ్తోందా?’ అనే చర్చకు దారితీస్తోంది. ఈ హీరోలు తమ ఫిట్నెస్, లైఫ్‌స్టైల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఇలాంటి ‘ఏజింగ్ బ్యాక్‌వర్డ్స్’ లుక్ సాధ్యమవుతోందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.
News November 20, 2025
గంభీర్‌పై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడటంతో హెడ్ కోచ్ గంభీర్‌పై <<18307995>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందించారు. ‘గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. కోల్‌కతా పిచ్‌ను మేం బ్లేమ్ చేయట్లేదు. అది అంత త్వరగా టర్న్ అవుతుందని ఊహించలేదు’ అని పేర్కొన్నారు.
News November 20, 2025
ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం: DGP

AP: 2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


