News March 19, 2025
సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారు: నాసా

అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయని తెలిపింది. స్పేస్ ఎక్స్, నాసా సమష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని పేర్కొంది. ఈ యాత్రను విజయవంతం చేయడంలో స్పేస్ ఎక్స్ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించింది. ఈ యాత్రలో సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారని వివరించింది.
Similar News
News December 13, 2025
HILTP: భూ బదిలీకి ఒక్క దరఖాస్తూ రాలేదు

TG: హిల్ట్ (HILT) విధానం కింద పారిశ్రామిక భూముల బదిలీ కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TSIIDC)కు ఇంకా ఎలాంటి దరఖాస్తులూ అందలేదు. తెలంగాణలో 21 పారిశ్రామికవాడలు ఉన్నాయి. HILTను NOV 22న ప్రకటించారు. దీని కింద భూముల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే పరిశ్రమల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. త్వరలోనే యాజమాన్యాలతో ప్రభుత్వం భేటీ కానుంది.
News December 13, 2025
పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 13, 2025
బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఫలితాల వెల్లడిలో మార్పులు

బ్యాంక్ ఉద్యోగాల నియామకాల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. SBI, నేషనల్ బ్యాంకులు, RRB (Regional Rural Banks)ల పరీక్షా ఫలితాల ప్రకటన క్రమాన్ని మార్చింది. ఇకపై ముందుగా SBI, ఆ తర్వాత నేషనల్ బ్యాంకులు, చివరగా RRBల ఫలితాలను విడుదల చేస్తారు. అదే విధంగా ముందుగా PO (Probationary Officer) రిజల్ట్స్ తరువాత క్లరికల్‌వి ప్రకటించనున్నారు. దీనివల్ల అభ్యర్థులు మంచి ఉద్యోగాన్ని సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.


