News August 12, 2024

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రోదసిలోనే సునీత?

image

బోయింగ్ స్టార్‌‌లైనర్‌లో సమస్యలు తలెత్తడంతో మరో వ్యోమగామితో కలిసి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం పట్టొచ్చని నాసా పేర్కొంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ సాయంతో వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. 10 రోజుల మిషన్ కోసం ఈ ఏడాది జూన్ 6న సునీత ISSకు వెళ్లారు.

Similar News

News December 25, 2025

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్

image

సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘థాయ్ కిళవి’ సినిమా కోసం పూర్తిస్థాయి గ్రామీణ వృద్ధురాలి పాత్రలో ఒదిగిపోయారు. మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తూ ‘ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో’ అంటూ ఆమె పాత్ర గురించి చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.

News December 25, 2025

డిసెంబర్ 25: చరిత్రలో ఈ రోజు

image

✒ 1861: సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా జననం
✒ 1924: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(ఫొటోలో) జననం
✒ 1971: డైరెక్టర్ కరుణాకర్ జననం
✒ 1972: భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి మరణం
✒ 1974: ప్రముఖ నటి, రాజకీయ నేత నగ్మా జననం
✒ 1981: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ జననం
✒ సుపరిపాలన దినోత్సవం

News December 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.