News November 7, 2024
సునీతా విలియమ్స్ ఆరోగ్యంగా ఉన్నారు: నాసా

సునీతా <<14549029>>విలియమ్స్<<>> ఆరోగ్యంగా ఉన్నట్టు నాసా స్పష్టత ఇచ్చింది. ISSలో ఉన్న వ్యోమగాములందరూ ఆరోగ్యంగా ఉన్నారని, వీరికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నాసా ప్రతినిధి జిమి రస్సెల్ తెలిపారు. ఫ్లైట్ సర్జన్లు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. అయితే కేలరీల లోటు వల్ల కొంచెం బరువు తగ్గడంతో సునీత బుగ్గలు లోపలికి అణిగినట్టు గుర్తించానని రస్సెల్ పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
నారాయణపేట జిల్లాలో పెరుగుతున్న హెచ్ఐవీ కేసులు

నారాయణపేట జిల్లాలో హెచ్ఐవీ-ఎయిడ్స్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 4,557 కేసులు నమోదు కాగా, 1,418 మంది మరణించారు. ప్రస్తుతం 1,822 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు విస్తరిస్తుండటంతో, అధికారులు అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.
News December 1, 2025
పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్ విధించనున్నట్లు సమాచారం.
News December 1, 2025
ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.


