News March 12, 2025

ఆరోజునే భూమి మీదకు సునీతా విలియమ్స్!

image

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు చేరుకోనున్నారు. స్పేస్‌ఎక్స్ సంస్థ పంపనున్న వ్యోమనౌకలో వీరు తిరిగి భూమి మీదకు చేరుకోనున్నారు. ఈరోజు క్రూ-10ను ప్రయోగించనుండగా, అది ఈనెల 16న ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురానుంది. సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Similar News

News October 17, 2025

బంగారం, వెండి కొంటున్నారా?

image

ధన త్రయోదశి సందర్భంగా రేపు బంగారం, వెండి కొనుగోలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. అష్టైశ్వర్యాల అధినాయకురాలైన ధనలక్ష్మి కటాక్షం కోసం.. లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొని, పూజించాలని సూచిస్తున్నారు. ఈరోజున కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే రాబోయే ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని, సంపదకు లోటుండదని అంటున్నారు. ధనలక్ష్మి అనుగ్రహంతో కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

News October 17, 2025

రేపటి బంద్‌లో అందరూ పాల్గొనాలి: భట్టి

image

TG: BCలకు రిజర్వేషన్లపై నిర్వహించే బంద్‌లో అందరూ పాల్గొనాలని Dy.CM భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘BRS రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి BC కోటాను తగ్గించింది. మేం సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% కల్పించాం. బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదు. అందుకే రిజర్వేషన్ల పెంపు కోర్టుల్లో నిలిచిపోతోంది. BJP నైజం బయటపడింది. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు’ అని భట్టి అన్నారు.

News October 17, 2025

​స్కాలర్​షిప్.. రేపే లాస్ట్ డేట్

image

​నేషనల్​ మీన్స్​ కమ్​ మెరిట్​ స్కాలర్​షిప్​ స్కీమ్(NMMSS-2026)కు దరఖాస్తు చేసేందుకు రేపే చివరి తేది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు రేపటి లోగా ఆన్​లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాలి. OCT​ 22లోగా ఆన్​లైన్​‌లో అప్లై చేసిన ఫామ్‌ను సంబంధిత పాఠశాల HMలు DEOలకు పంపించాల్సి ఉంటుంది. ఈ స్కీం ద్వారా ఆర్థికంగా వెనకబడిన మెరిట్ స్టూడెంట్స్​కు 9వ తరగతి నుంచి ఇంటర్​ వరకు ఏటా రూ.12వేల స్కాలర్​షిప్​ అందజేస్తారు.