News March 16, 2025
భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎప్పుడంటే

వారం రోజుల మిషన్పై వెళ్లి 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపై అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 19న భూమికి తిరిగి రానున్నారు. వీరు ప్రయాణించే డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. దీంతో వ్యోమగాములిద్దరూ క్షేమంగా తిరిగిరావాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కోరుకుంటున్నారు.
Similar News
News March 16, 2025
నాన్ వెజ్ ఎవరు తినకూడదంటే?

కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ అందరికీ మాంసాహారం సరిపడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదు. ఇందులో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ వీరికి హానికరం. గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు కూడా ఇది తినకపోవడమే బెటర్. ఇందులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. అలర్జీ, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఉన్నవారు నాన్ వెజ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.
News March 16, 2025
PHOTOS: స్టైలిష్ లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చారు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఆయన కళ్లజోడుతో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. చెర్రీ లేటెస్ట్ లుక్స్ అదిరిపోయాయని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RC16లో రామ్ చరణ్ నటిస్తున్నారు.
News March 16, 2025
మీపై నమ్మకం ఉంచుకోండి: సీఎం చంద్రబాబు

AP: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయి. దృష్టి కేంద్రీకరించి కష్టపడి పని చేయండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే విజయం వెంటాడుతుందని గుర్తుంచుకోండి’ అని ట్వీట్ చేశారు.