News June 15, 2024
ఈనెల 22న భూమి మీదకు సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్ ఈనెల 22న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకు రానున్నట్లు నాసా వెల్లడించింది. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈనెల 5న బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ISSకు వెళ్లిన సంగతి తెలిసిందే. వారు ISS నుంచి భూమిపైకి రావడానికి దాదాపు 6hrs పట్టొచ్చని, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఉటా, న్యూ మెక్సికో లేదా ఇతర బ్యాకప్ స్థానాల్లో ఓ చోట ల్యాండ్ అవుతారని నాసా పేర్కొంది.
Similar News
News November 22, 2025
యాషెస్ టెస్టు.. 847 బంతుల్లోనే ముగిసింది

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు 847 బంతుల్లోనే ముగిసింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. 1895లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ 911 బంతుల్లో ముగిసింది. అటు తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు 405 బంతులే(67.3 ఓవర్లు) ఎదుర్కొన్నారు. 1904 తర్వాత ఇంత తక్కువ ఓవర్లలో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులను ముగించడం ఇదే తొలిసారి.
News November 22, 2025
నాన్న 50ఏళ్లు ఇండస్ట్రీని తన భుజాలపై మోశారు: విష్ణు

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు మోహన్ బాబు 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ’94 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమను 50 ఏళ్లు మా నాన్న తన భుజాలపై మోశారు. ఆయన అసాధారణ ప్రయాణాన్ని చూడగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. 50 లెజెండరీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు. ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.
News November 22, 2025
గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్ ఐడీ, పాస్వర్డ్లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


