News March 19, 2025

త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దీంతో ఆమె పూర్వీకుల గ్రామం ఝూలాసన్‌లో బంధువులు సంబరాలు చేసుకున్నారు. 9 నెలల తర్వాత సునీత సేఫ్‌గా భూమిపైకి తిరిగిరావడం సంతోషంగా ఉందని ఆమె సోదరి ఫాల్గుణి పాండ్య తెలిపారు. తామంతా ఓ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇందులో పాల్గొనేందుకు సునీత ఇండియాకు వస్తారని పేర్కొన్నారు.

Similar News

News January 17, 2026

బెంగాల్‌లో మార్పు కావాలి.. బీజేపీ రావాలి: మోదీ

image

TMC అంటే అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలనే విషయం బయటపడిందని PM మోదీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటోందని, కేంద్ర సాయం ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. బెంగాల్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం BJP ప్రభుత్వం రావాలన్నారు. బిహార్‌లో NDA గెలుపు తర్వాత ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చిందని మాల్డా సభలో అన్నారు. ‘మార్పు కావాలి.. బీజేపీ రావాలి’ అని PM కొత్త నినాదమిచ్చారు.

News January 17, 2026

రిపబ్లిక్ డే వేడుకలకు ఉగ్ర ముప్పు!

image

రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్ర సంస్థలు టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఖలిస్థానీ, బంగ్లా టెర్రర్ సంస్థలు దాడులకు ప్లాన్ చేసినట్లు వెల్లడించాయి. హరియాణా, పంజాబ్, ఢిల్లీ-NCR, UP, రాజస్థాన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాదులతో లింక్ ఉన్న గ్యాంగ్‌స్టర్లు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాయి. గతేడాది ఢిల్లీలో <<18265346>>కారు పేలుడు<<>> నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి.

News January 17, 2026

వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టిన మరాఠా

image

అధికారం కోసం చేసే రాజకీయ విన్యాసాలను ప్రజలు తిరస్కరిస్తారనేందుకు MH మున్సిపల్ ఎన్నికలే తార్కాణం. 2023లో NCP చీలి బాబాయ్, అబ్బాయి శరద్, అజిత్ పవార్లు విడిపోయారు. తాజా ఎన్నికల్లో చేతులు కలిపారు. అటు అన్నదమ్ములు ఉద్ధవ్(శివసేన), రాజ్ ఠాక్రే(MNS)లు కూడా విభేదాలు పక్కనపెట్టి MNP ఎన్నికల్లో కలిసిపోయారు. కానీ వీరికి ఆశించిన ఫలితాలు రాలేదు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిద్దామనుకున్న వీరిని ప్రజలు ఆదరించలేదు.