News November 6, 2024
అంతరిక్షం నుంచి ఓటేసిన సునీత విలియమ్స్
అమెరికాలో పోలింగ్ సందర్భంగా అంతరిక్షంలో ఉన్న ఆదేశ వ్యోమగాములు అక్కడి నుంచే ఓటేశారు. సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, డాన్ పెటిట్, నిక్ హాగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు అమెరికా జాతీయ జెండాలు కలిగిన సాక్స్‌లు వేసుకొని ‘అమెరికన్లుగా గర్వపడుతున్నాం’ అని సందేశం పంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వ్యోమగాములు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Similar News
News November 6, 2024
ఫోన్ ఛార్జింగ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి
చాలామంది ఫోన్ ఛార్జింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అది ఫోన్ల పేలుళ్లకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి.
* రాత్రంతా ఛార్జింగ్ పెట్టొద్దు. ఫోన్‌ను బట్టి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి పట్టే సమయాన్ని తెలుసుకొని, అంతసేపే ఛార్జింగ్ పెట్టాలి.
* ప్లగ్ ఇన్ చేసి ఫోన్ మాట్లాడటం, చాటింగ్ చేయొద్దు.
* వంటగదుల్లో ఛార్జింగ్ పెట్టొద్దు.
* ఫుల్ ఛార్జ్ అయినా స్విచ్ ఆఫ్ చేయకపోవడం ప్రమాదకరం.
News November 6, 2024
IPL వేలంలోకి అండర్సన్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ IPL మెగా వేలంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 42 ఏళ్ల ఆటగాడు చివరిసారి 2011, 2012లో వేలంలో పాల్గొనగా ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఆ తర్వాత అండర్సన్ IPL వైపు తొంగిచూడలేదు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత IPLలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.
News November 6, 2024
EXIT POLL: ఓటర్లను ప్రభావితం చేస్తున్న 5 అంశాలివే..
అమెరికా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్న 5 ప్రధాన అంశాలను ‘ఎడిసన్ రీసెర్చ్’ తొలి ఎర్లీ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించింది. 35% మందిని ‘ప్రజాస్వామ్యం’, 31% మంది ‘ఎకానమీ’, 14% మంది ‘అబార్షన్’ అంశం, 11% మంది ‘వలస విధానం’, 4% మందిని ‘విదేశీ పాలసీ’ ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యం, అబార్షన్ అంశాలు కమలకు, ఎకానమీ, వలస విధానం ట్రంప్‌నకు కలిసొస్తున్నట్లు సర్వేలో తేలింది.