News March 19, 2025
సునీత.. మీరు పట్టుదల అంటే ఏంటో చూపించారు: మోదీ

ISS నుంచి భూమిపైకి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములను PM మోదీ ప్రశంసించారు. ‘వెల్కమ్ బ్యాక్ crew9. మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది. పట్టుదల అంటే ఏంటో చూపించారు. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. అంతరిక్ష అన్వేషణ అంటే సామర్థ్యానికి మించి సరిహద్దుల్ని దాటుకుని వెళ్లడం, కలల్ని నిజం చేసుకునే ధైర్యం ఉండటం. సునీత ఒక ఐకాన్. వారిని సురక్షితంగా తీసుకొచ్చిన వారి పట్ల గర్వంగా ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 8, 2025
BREAKING: సెలవుల జాబితా విడుదల

TG: 2026కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకుల సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను కేటాయించింది. బ్యాంకులకు 23 సెలవులను ఇచ్చింది. హాలిడేస్ లిస్టు కోసం పైన ఫొటోను స్లైడ్ చేసి చూడండి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా <<18470577>>సెలవుల జాబితాను<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలో జూపార్క్.. ‘వనతారా’తో కుదిరిన ఒప్పందం

TG: అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న ‘వనతారా’ నేషనల్ జూపార్క్ ఫ్యూచర్ సిటీలోనూ ఏర్పాటు కానుంది. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ ప్రభుత్వంతో వనతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. వనతారా నేషనల్ జూ పార్క్ ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తుండగా గతంలో PM మోదీ దీన్ని సందర్శించారు.
News December 8, 2025
ఆధార్ దుర్వినియోగాన్ని ఇలా తెలుసుకోండి!

సైబర్ మోసాలను అరికట్టేందుకు తరచూ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవాలని ‘UIDAI’ సూచించింది. దీనిద్వారా మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో, ఇంకెవరైనా వాడుతున్నారో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం తొలుత My Aadhaar పోర్టల్‌ను సందర్శించాలి. ఆధార్ నంబర్‌తో లాగిన్ అయి ‘authentication history’ని <


