News March 19, 2025
భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం పలికారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని, బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలని ఆకాంక్షించారు.
Similar News
News March 19, 2025
విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసింది: లోకేశ్

AP: ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారనడం సరికాదని చెప్పారు. కాగా బొత్సతో చర్చకు సిద్ధమని లోకేశ్ చెప్పారు. ఐటీ సిలబస్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ఆయనను డిమాండ్ చేశారు.
News March 19, 2025
IPL: ఆ మ్యాచ్ రీషెడ్యూల్ ?

ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన KKRvsLSG మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. అదే రోజు శ్రీరామనవమి ఉండడంతో కోల్‌కతా వ్యాప్తంగా భారీగా ఊరేగింపులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఊరేగింపులకు, ఇటు మ్యాచుకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారనుంది. ఈ కారణంతో మ్యాచును రీషెడ్యూల్ చేసే ఛాన్సుంది. గత ఏడాది KKRvsRR మ్యాచునూ ఇదే కారణంతో వాయిదా వేశారు.
News March 19, 2025
ఈ ఏడాది ఆ క్రేజీ మూవీకి పార్ట్-2!

క్రేజీ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి పార్ట్-2 తీయనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలని పోస్ట్ చేశారు. దీంతో ENE2 రాబోతుందని సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది.