News August 30, 2025

దుబాయ్‌లో ఎండలు.. ఐసీసీ కీలక నిర్ణయం?

image

ఆసియా కప్‌ మ్యాచుల ప్రారంభ సమయాన్ని ICC మార్పు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 19 మ్యాచులకు గానూ 18 మ్యాచులకు సమయం మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైనల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో ప్రతీ మ్యాచ్ రా.8 గంటలకు ప్రారంభం కానుంది. టైమింగ్స్ మార్పునకు ఎండ తీవ్రతలే కారణమని తెలుస్తోంది. దుబాయ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ICC ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News August 31, 2025

ఈనాటి ముఖ్యాంశాలు

image

* ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది: కుప్పంలో సీఎం
* TG: రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక
* బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పొన్నం
* యూరియా కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం: హరీశ్‌రావు
* చైనాలో మోదీకి రెడ్ కార్పెట్ వెల్‌కమ్
* తెలంగాణ వరద బాధితులకు బాలకృష్ణ రూ.50 లక్షల సాయం
* అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నం(94) కన్నుమూత

News August 31, 2025

పోర్న్ సైట్‌లో మెలోనీ మార్ఫింగ్ ఫొటోలు

image

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మార్ఫింగ్ ఫొటోలు పోర్న్ సైట్‌లో దర్శనమివ్వడం తీవ్ర దుమారం రేపింది. 7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆ సైట్‌లో మెలోనీతోపాటు పలువురు ప్రముఖుల ఫొటోలూ ఉన్నాయి. తనతోపాటు చాలామంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంపై మెలోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి చర్యలు చాలా అసహ్యకరం. బాధిత మహిళలందరికీ నా మద్దతు ఉంటుంది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’ అని హెచ్చరించారు.

News August 31, 2025

మోదీ-ట్రంప్ మధ్య విభేదాలకు కారణం ఇదేనా?

image

మోదీకి జూన్ 17న కాల్ చేసిన ట్రంప్.. భారత్-పాక్ సీజ్‌ఫైర్ గురించి ప్రస్తావించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తాను యుద్ధాన్ని ముగించానని, పాక్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబోతుందని చెప్పినట్లు రాసుకొచ్చింది. దాన్ని మోదీ తిరస్కరించారని, సీజ్‌ఫైర్‌లో మూడో దేశం ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారని తెలిపింది. నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ చేసేందుకు ఇష్టపడకపోవడంతో ట్రంప్ అలిగినట్లు వివరించింది.