News April 6, 2025

గుజరాత్‌తో సన్‌రైజర్స్ ఢీ.. గెలుపెవరిదో!

image

IPLలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు గుజరాత్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న SRH సొంత గ్రౌండ్‌లో మళ్లీ గాడిన పడాలని చూస్తోండగా వరుస విజయాల జోరును కొనసాగించాలని GT భావిస్తోంది. SRH టీమ్ బ్యాటింగ్‌లో క్లిక్ అవ్వకపోగా బౌలింగ్‌లో వికెట్లూ తీయలేకపోతోంది. ఫీల్డింగ్‌లోనూ పేలవంగానే కనిపిస్తోంది. మరోవైపు GT బలంగా ఉంది. మరి ఈరోజు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News April 7, 2025

50కి పైగా దేశాలు మాతో బేరాలాడుతున్నాయి: US

image

ట్రంప్ విధించిన సుంకాలతో ప్రభావితమైన వాటిలో 50కి పైగా దేశాలు తమతో టారిఫ్‌ల తగ్గింపుపై బేరాలాడుతున్నాయని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ వెల్లడించారు. ‘దేశ ప్రయోజనాలే ట్రంప్‌కు ముఖ్యం. వేరే ఉద్దేశాలేం లేవు. అనేక దేశాలు ఇప్పుడు మాతో చర్చలు జరుపుతున్నాయి. సుంకాల వల్ల పెద్ద ఇబ్బంది అవుతుందని మేం భావించట్లేదు. మనకు ఎగుమతి చేసే దేశాలు తమ సుంకాల్ని తగ్గిస్తాయంతే’ అని వివరించారు.

News April 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 7, 2025

ఏప్రిల్ 7: చరిత్రలో ఈరోజు

image

1920: సంగీత విద్వాంసుడు రవిశంకర్ జననం
1942: బాలీవుడ్ నటుడు జితేంద్ర జననం
1962: సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ జననం
1962: నటి కోవై సరళ జననం
1991: కవి కొండవీటి వెంకటకవి మరణం
* ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

error: Content is protected !!