News February 7, 2025

మరోసారి SA20 ఫైనల్‌కు సన్‌రైజర్స్

image

‘SA20’లో ఎలిమినేటర్‌లో పార్ల్ రాయల్స్‌పై గెలిచి సన్‌రైజర్స్(SEC) ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 175/4 స్కోరు చేసింది. రూబిన్(81), ప్రిటోరియస్(59) రాణించారు. ఛేజింగ్‌లో SEC ఓపెనర్ జోర్జీ(78), జోర్డాన్(69) తడబడకుండా ఆడారు. ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్‌టైన్(MICT)తో రేపు రాత్రి 9గంటలకు సన్‌రైజర్స్ తలపడనుంది. మార్క్రమ్ సేన తొలి రెండు సీజన్లు కప్ కొట్టిన సంగతి తెలిసిందే.

Similar News

News November 17, 2025

US నుంచి LPG దిగుమతి.. తగ్గనున్న ధరలు: హర్దీప్‌సింగ్

image

అమెరికా నుంచి LPGని దిగుమతి చేసుకునేందుకు కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ తెలిపారు. ‘ఏడాదిపాటు ఈ డీల్ అమల్లో ఉంటుంది. IND కంపెనీలు 2.2MTPA ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఇది మొత్తం వార్షిక దిగుమతుల్లో 10 శాతానికి సమానం. ప్రజలకు మరింత తక్కువ ధరకు LPGని అందించడంలో ఇదొక ముందడుగు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹1100 ఉన్నప్పటికీ ₹500-550కే అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News November 17, 2025

మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

image

భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొద్దు. నేరుగానే పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.

News November 17, 2025

వేరుశనగ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వేరుశనగ పంట కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. పంటలో 70 నుంచి 80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి, కాయడొల్ల లోపల భాగం నలుపు రంగులోకి మారినప్పుడే పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క నుంచి కాయలను వేరుచేశాక కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగులు రాకుండా స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.