News November 24, 2024
మార్క్రమ్ను వదిలేసిన సన్‌రైజర్స్

SRH మాజీ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు బిడ్ వేసి సొంతం చేసుకుంది. గత కొన్ని సీజన్లుగా తమ జట్టులో ఉన్న మార్క్రమ్ను తిరిగి కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ ఆసక్తి చూపించలేదు. దక్షిణాఫ్రికా టీ20లీగ్‌లో SRH సిస్టర్ ఫ్రాంచైజీ ఈస్టర్న్ కేప్‌కు ఐడెన్ కెప్టెన్‌గా రెండుసార్లు కప్ అందించడం గమనార్హం.
Similar News
News January 4, 2026
నవీన్ రావుకు నోటీసులు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. MLC నవీన్ రావు ఇవాళ 11amకు జూబ్లీహిల్స్ PSలో విచారణకు హాజరుకావాలని SIT నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక డివైజ్‌తో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. దీనిపై ఇవాళ ప్రశ్నించే అవకాశముంది. తెలంగాణ ఉద్యమంలో KCR వెంట ఉన్న నవీన్‌కు 2019లో BRS MLC పదవి ఇచ్చింది.
News January 4, 2026
$17 ట్రిలియన్ల సంపదే లక్ష్యం.. మదురో అరెస్ట్ వెనుక అసలు కథ ఇదేనా?

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించడంలో ఆ దేశంలోని 303 బిలియన్ బారెల్స్ ఆయిల్ నిక్షేపాలను కైవసం చేసుకోవడమే అమెరికా అసలు ప్లాన్ అనే చర్చ జరుగుతోంది. మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ $17.3 ట్రిలియన్లని అంచనా. ఇందులో సగం రేటుకు అమ్మినా $8.7 ట్రిలియన్లు వస్తాయి. ఇది జపాన్ GDP కంటే 4 రెట్లు ఎక్కువ. 12 గంటల్లో చైనా, అమెరికా మినహా ప్రపంచ దేశాలన్నింటి కంటే ఎక్కువ సంపదను US తన గుప్పిట్లోకి తెచ్చుకుంది.
News January 4, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)నవీ ముంబైలో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 6) ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/B.Tech/BSc(Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ ఇంజినీర్లకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. ప్రాజెక్టు ఇంజినీర్లకు 32 ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి సడలింపు). ట్రైనీ Engg.కు JAN 16న, ప్రాజెక్ట్ Engg.కు JAN 20న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్సైట్: bel-india.in


