News January 14, 2025

SUPER.. దేశంలోనే మొదటి పార్కింగ్ కాంప్లెక్స్ మన HYDలో..!  

image

HYD నాంపల్లి పరిధిలో నిర్మించిన ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నాంపల్లి పరిధిలో రోడ్డుపై పార్కింగ్ సమస్యలు తగ్గనున్నాయి. ఈ పార్కింగ్‌ను 15 అంతస్తులు మేర, జర్మన్ టెక్నాలజీతో నిర్మించారు. దేశంలో ఇదే మొట్ట మొదటి పెద్ద ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్ కానుంది.

Similar News

News October 21, 2025

జూబ్లీహిల్స్‌లో పోటెత్తిన నామినేషన్లు..!

image

HYDజూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా క్యూలో 100కు పైగా నామినేషన్ల సెట్లు ఉన్నాయి. ఈరోజు సా.6.30 వరకు మొత్తం 80 దాఖలయ్యాయి. సా.3లోపు ఆర్వో ఆఫీస్ లోపలికి వెళ్లిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఒక్కో నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తుండడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.ఈరోజు చివరి తేదీ కావడంతో అభ్యర్థులు పోటెత్తారు.

News October 21, 2025

HYD: బీసీ నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలి: ఆర్.కృష్ణయ్య

image

శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెడతారా అని BJP ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా బీసీ బంద్ విజయవంతమైందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని చెప్పారు. అయితే బీసీ బంద్‌లో చిన్నాచితక గొడవలు జరిగాయని, వాటిని పోలీసులు కోరంతను కొండంత చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తమపై బనాయించిన 30 కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు.

News October 21, 2025

HYD: సీఎం ప్రజావాణికి 62 దరఖాస్తులు

image

బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 62 దరఖాస్తులు అందాయి. దీపావళి వేడుకలు ఉన్నా ప్రజలు సీఎం ప్రజావాణికి వచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 18, రెవెన్యూ శాఖకు సంబంధించి 10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 18 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.