News January 16, 2026
SUPER.. నిజామాబాద్‌కి FIRST RANK

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో మన నిజామాబాద్ జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. 6.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్ తొలి స్థానంలో నిలవగా 5.23 లక్షల MTల ధాన్యం సేకరణతో నల్గొండ సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. కాగా ఇక్కడ అమ్మకాలు చేసిన రైతులకు పౌరసరఫరాల శాఖ 7రోజుల్లోనే డబ్బును ఖాతాల్లో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్మలేదు.
Similar News
News March 11, 2026
రూ.126 కోట్ల ‘గ్రీన్’ టెండర్లు.. పచ్చదనం ముసుగులో నిధుల దోపిడీయేనా?

HMDA గ్రీన్ ప్లాన్‌లో మతలబు ఏంటి? పదేళ్ల పాటు మొక్కల సంరక్షణ పేరుతో రూ. 126 కోట్లు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్ పరిస్థితి దారుణంగా ఉంటే, కొత్తగా ఇన్ని కోట్లు కుమ్మరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. చట్టబద్ధంగా టెండర్లు పిలిచామని అధికారులు చెబుతున్నా, కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.
News March 11, 2026
‘ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వండి’

నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు పంట రుణాలతో పాటు, స్వయం సహాయక మహిళ సంఘాలకు, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణ పంపిణీలో చొరవ చూపాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు.
News March 11, 2026
నెల్లూరు: 9వ తరగతి విద్యార్థులకు గమనిక

ఇస్రో ఆధ్వర్యంలో జరగనున్న యువిక-2026 ఉచిత శిక్షణకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో 9th విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా www.isro.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు పంపించాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీన సెలక్ట్ చేసిన విద్యార్థులు మే 11 – 22 తేదీ వరకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.


