News December 31, 2024
SUPER: ఒకే పేజీలో క్యాలెండర్

సంవత్సరం మారడంతో ప్రతి ఇంట్లో 2025 క్యాలెండర్ సందడి చేస్తుంది. ప్రతి నెలకు ఒక సెపరేట్ పేజీ కాకుండా ఏడాదిలోని అన్ని తేదీలు ఒకే పేజీలో ఉంటే ఎలా ఉంటుంది. సూపర్ కదా! అలాంటి క్యాలెండరే మీ కోసం. పై ఫొటోలోని క్యాలెండర్లో ఏడాదికి సంబంధించిన అన్ని తేదీలు, వారాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. మరి ఈ సింపుల్ ONE PAGE CALENDARను మీ సన్నిహితులతో పంచుకోండి.
>>SHARE IT
Similar News
News December 13, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.
News December 13, 2025
బలి ‘గుమ్మడికాయ’తో ఇద్దామా?

అమ్మవార్లకు చాలామంది కోడి, మేకలను బలి ఇస్తారు. అయితే ఈ జంతు బలి కంటే కూడా గుమ్మడికాయ బలితోనే అమ్మవారు ఎక్కువ సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. కూష్మాండాన్ని శిరస్సుకు ప్రతీకగా భావించి అమ్మవారికి దీన్ని సమర్పించాలని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ విధానమే శ్రేయస్కరమని చెబుతున్నాయి. అందుకే దసరాకి కూష్మాండాన్నే బలిస్తారు. ఇది హింస లేని, దైవ ప్రీతి కలిగించే ఉత్తమ మార్గం.
News December 13, 2025
మెస్సీతో ఫొటో రూ.10లక్షలు.. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే?

దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ భారత పర్యటన మొదలైంది. ఈ తెల్లవారుజామున కోల్కతా చేరుకున్న ఆయన సాయంత్రానికి HYD రానున్నారు. ఇక్కడ మ్యాచ్ అనంతరం ఫొటో సెషన్ ఉండనుంది. ఆయనతో ఫొటో దిగేందుకు రూ.10లక్షల ఫీజు నిర్ణయించగా 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు HYD గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. అటు ఇవాళ సాయంత్రం ఉప్పల్లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 27 వేల టికెట్లు బుక్ అయ్యాయి.


