News September 27, 2024

OTTలోకి వచ్చేస్తున్న సూపర్‌హిట్ మూవీ

image

విశ్వదేవ్, ప్రియదర్శి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ’35 చిన్న కథ కాదు’ సినిమా OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 2 నుంచి AHAలో అందుబాటులోకి రానుంది. ‘ఈ చిన్న కథలో వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది’ అంటూ AHA Xలో రాసుకొచ్చింది. SEP 6న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నందకిశోర్ ఇమాని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా సమర్పించారు.

Similar News

News December 3, 2025

పలు జిల్లాలకు వర్షసూచన

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News December 3, 2025

నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

image

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

News December 3, 2025

ఊట వేసిన మడి, వాత వేసిన పశువు

image

‘ఊట వేసిన మడి’ అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న పొలం (మడి). ఇది ఎప్పుడూ పచ్చగా, సమృద్ధిగా ఉంటుందని, దిగుబడి బాగా వస్తుందని అర్థం. అలాగే పూర్వకాలంలో పశువులకు (ముఖ్యంగా ఆవులు, ఎద్దులు) వ్యాధులు వచ్చినప్పుడు లేదా గాయాలు తగిలినప్పుడు ‘వాత’ వేసి చికిత్స అందించి నయం చేసేవారు. ఇలా ఊట వేసిన మడి, వాత వేసిన పశువు వల్ల రైతుకు మేలే జరుగుతుందని ఈ సామెత చెబుతుంది.