News March 25, 2024
OTTలోకి సూపర్ హిట్ మూవీ!

ప్రియమణి, యామీ గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆర్టికల్ 370. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. రూ.20 కోట్లతో తెరకెక్కగా.. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జియో సినిమాలో ఏప్రిల్ 19 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 7, 2026
IPL: నేడు ముంబైvsరాజస్థాన్

IPLలో ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గువాహటి వేదికగా 7.30PMకి మ్యాచ్ స్టార్టవుతుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 30 సార్లు తలపడగా 16 విజయాలతో MI పైచేయి సాధించింది. 2021 నుంచి 8 మ్యాచుల్లో 5 విజయాలు నమోదు చేసింది. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో బ్యాలెన్స్‌డ్‌గా ఉండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. MI కెప్టెన్ హార్దిక్ ఈ మ్యాచుకు అందుబాటులో ఉంటారని సమాచారం.
News April 7, 2026
ALERT.. నేటి నుంచి వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు ఏపీలో నేడు, రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. నేడు ఉత్తర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వానలు పడతాయని వివరించింది.
News April 7, 2026
ఒత్తిడి, షుగర్, స్మోకింగ్‌తో నోటి ఆరోగ్యానికి ముప్పు!

ఒత్తిడి, షుగర్, స్మోకింగ్ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఒత్తిడి వల్ల నిద్రలో పళ్లు కొరకడం, దవడలు బిగించడం వంటివి జరిగి పంటి ఎనామెల్ అరిగిపోతుంది. దవడ నొప్పి వస్తుంది. చక్కెర ఆహారాలు వల్ల దంతాలు దెబ్బతింటాయి. స్మోకింగ్ చేస్తే చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. అందుకే షుగర్ తగ్గించి క్రమం తప్పకుండా బ్రష్, యోగా, మెడిటేషన్ చేయాలి’ అని సూచిస్తున్నారు.


