News August 25, 2024
OTTలోకి సూపర్ హిట్ సినిమా

బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన హారర్ కామెడీ సినిమా ‘ముంజ్య’ హాట్‌స్టార్‌లో విడుదలైంది. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ మూవీ రూ.135 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘బడ్డీ’ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.
Similar News
News March 24, 2026
వరిలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

వరి పైరులో గింజ పాలుపోసుకునే దశలో కంకి నల్లి ఆశిస్తుంది. వీటి వల్ల ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నల్లగా మారతాయి. గింజలపై కూడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల గింజలు పాలు పోసుకోకుండా తాలుగా మారి పంట దిగుబడి 20-30% తగ్గే అవకాశం ఉంది. కంకినల్లి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా స్పెరోమెసిఫిన్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో మందుమార్చి 2 సార్లు పిచికారీ చేయాలి.
News March 24, 2026
స్కిప్పింగ్‌తో ఎన్నో లాభాలు

ప్రతిరోజు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు పటిష్ఠంగా మారతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్ చేయడం ద్వారా డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది.
News March 24, 2026
ఏప్రిల్ వరకు ‘ఉపాధి’.. APకి 4.40 కోట్ల పనిదినాలు

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీకి వచ్చే నెల కోసం 4.40 కోట్ల పనిదినాలను కేటాయించింది. కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ పథకాన్ని మే 1 నుంచి ప్రారంభిస్తామని తెలిపింది. ఏప్రిల్ నుంచే ఆ స్కీమ్ అమలు చేయాల్సి ఉండగా విధివిధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో మరో నెల వాయిదా వేసినట్లు తెలుస్తోంది.


