News March 18, 2025

ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా

image

ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ నెల 21 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఇండియా ట్వీట్ చేసింది. కాలేజీ జీవితం, నిజాయితీపై అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

Similar News

News March 18, 2025

విజయ్‌పై అన్నామలై ఫైర్.. సినిమా సెట్స్‌లో ఎంజాయ్ చేస్తున్నాడంటూ..

image

తమిళ హీరో, TVK అధినేత విజయ్‌పై TN BJP చీఫ్ అన్నామలై మండిపడ్డారు. ‘సినిమాల్లో డ్రింక్, స్మోక్ చేసే నీకు మద్యం కుంభకోణం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇంట్లో నుంచి రాజకీయాలు చేయడం కాదు. గ్రౌండ్ లెవెల్‌‌కి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. సినిమా సెట్స్‌లో సిగరెట్, మద్యం తాగుతూ హీరోయిన్ల నడుము తాకుతూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నాడు. నేను అతనిలా కాదు. క్షేత్ర స్థాయిలో పోరాడుతున్నా’ అని కామెంట్స్ చేశారు.

News March 18, 2025

50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన

image

AP: పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై YCP MLCలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే ₹4వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం ₹వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైమ్ తీసుకుంటే మేం రాగానే ₹1,000 పెంచాం. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నాం’ అని తెలిపారు.

News March 18, 2025

బాక్సాఫీస్ సమరానికి సిద్ధమైన అన్నదమ్ములు?

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇదేరోజున మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘భైరవం’ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందని సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పరస్పర ఘర్షణలతో అన్నదమ్ములు వార్తల్లో నిలుస్తుండగా ఒకేరోజు రిలీజైతే మంచు ఫ్యామిలీలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఒకేరోజు వస్తే మీరు ఏ సినిమాకు వెళ్తారు?

error: Content is protected !!