News March 9, 2025

సూపర్ భారత్.. ఒక్క ఓటమి లేకుండా..

image

2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ సమష్టి కృషితో మరో ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఎవరో ఒకరిపై ఆధారపడకుండా జట్టులోని 11 మంది ప్లేయర్లు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. లీగ్ స్టేజీ, సెమీఫైనల్, ఫైనల్ ఇలా ప్రతి రౌండ్లో ఒక్క పరాజయం లేకుండా కప్పు ఎగరేసుకుపోయింది. టీమ్ ఇండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ.

Similar News

News November 27, 2025

పాలకమండలి లేకపోవడం వల్లే ‘విలీనం’ ఈజీ

image

గ్రేటర్‌లో కలువనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎటువంటి పాలక మండలి లేదు. సంవత్సరం క్రితమే పాలక మండళ్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లే పరిపాలన చేస్తున్నారు. విలీనాన్ని అడ్డుకునేందుకు గానీ, ప్రశ్నించేందుకు గానీ సభ్యులు ఎవరూ ఉండరు. అందుకే సర్కారు ఈ సమయం చూసి ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేసినపుడు కూడా అదే పరిస్థితి.

News November 27, 2025

సర్పంచ్ ఎన్నికలు.. నామినేషన్లు ప్రారంభం

image

TG: గ్రామాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఎల్లుండి వరకు కొనసాగనుంది. తొలి విడతలో 4,236 గ్రామాలు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

News November 27, 2025

సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>ICAR<<>>-సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 2 అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్:

Home