News March 13, 2025

సూపర్ ISRO: స్పేడెక్స్ అన్‌డాకింగ్ విజయవంతం

image

ఇస్రో అరుదైన ఘనత సాధించింది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. <<15168341>>స్పేడెక్స్<<>> అన్‌డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. కొన్ని నెలల క్రితం SDX-1, SDX-2 శాటిలైట్లను వేర్వేరుగా అంతరిక్షంలోకి పంపిన ఇస్రో వాటిని సమర్థంగా (డాక్) అనుసంధానించింది. ఇన్నాళ్లూ పనితీరును పరీక్షించి తాజాగా వాటిని విడదీసింది. దీంతో భవిష్యత్తు ప్రాజెక్టులైన స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, గగన్‌యాన్‌కు మార్గం సుగమమైంది.

Similar News

News March 13, 2025

‘కోర్ట్’కు పాజిటివ్ టాక్.. ప్రియదర్శి ఎమోషనల్

image

ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారు. థియేటర్‌లో నేలపై కూర్చొని నిర్మాత నానిని హత్తుకొని తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నాని షేర్ చేశారు.

News March 13, 2025

₹ చిహ్నం తొలగింపుతో TN పరువు తీసిన స్టాలిన్: అన్నామలై ఫైర్

image

భారత్‌లో TN హాస్యాస్పదంగా మారిపోయిందని ఆ రాష్ట్ర BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీకి వ్యతిరేకంగా DMK, CM స్టాలిన్ మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రూపీ సింబల్ తొలగించి తమిళ పదం పెట్టడంపై ఘాటుగా స్పందించారు. ‘రూపీ చిహ్నం రూపొందించింది తమిళుడైన ఉదయ్. ఆయన తండ్రి 1971లో DMK MLA. తమిళుడు రూపొందించిన ఈ చిహ్నాన్ని దేశం సగర్వంగా స్వీకరించింది. ఇప్పుడు స్టాలిన్ వల్ల పరువు పోతోంది’ అని అన్నారు.

News March 13, 2025

గాయపడ్డ నటి.. నుదిటిపై 13 కుట్లు!

image

సీనియర్ నటి, ఎవర్‌గ్రీన్ బ్యూటీగా పేరొందిన భాగ్యశ్రీ గాయపడ్డారు. పికిల్‌బాల్ ఆడుతుండగా ఆమె నుదిటిపై లోతైన గాయం తగిలింది. దీంతో నుదిటిపై 13 కుట్లు పడ్డాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. భాగ్యశ్రీ ‘మైనే ప్యార్‌ కియా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా చివరగా ‘రాధేశ్యామ్’, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రాల్లో నటించారు.

error: Content is protected !!