News March 15, 2025
సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్‌తో 365 రోజులు..

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ అందిస్తోంది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్‌గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్.
Similar News
News February 5, 2026
మేం వెళ్తున్నాం.. ఫ్లైట్ బుక్ చేశాం: సూర్య

T20 WCలో ఈనెల 15న జరిగే లీగ్ మ్యాచ్‌ను పాక్ <<19024958>>బాయ్‌కాట్ చేయడం<<>>పై టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ విషయంలో తమ జట్టు సన్నద్ధతలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ‘మేం స్పష్టంగానే ఉన్నాం. వాళ్ల(పాకిస్థాన్)తో ఆడబోమని మేం చెప్పలేదు. అలా అన్నది వాళ్లే. USA, కెనడాతో మ్యాచ్‌ల తర్వాత మేం కొలంబో వెళ్తాం. మా ఫ్లైట్ బుక్ అయింది. మేం వెళ్తున్నాం’ అని కెప్టెన్స్ మీట్‌లో చెప్పారు.
News February 5, 2026
అబద్ధాలు కాదు.. చేసింది చెబితే చాలు: CM

TG: పట్టణ ప్రాంతాల్లోని పథకాలు, చేకూర్చిన లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని CM రేవంత్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలను నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, టికెట్ రానివారిని కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని, చేసింది చెప్పాలని తెలిపారు. రాజకీయాల్లో డబ్బులతో కాదు.. నమ్మకంతోనే గెలుస్తామన్నారు.
News February 5, 2026
NIT జలంధర్ 101 పోస్టులకు నోటిఫికేషన్

<


