News November 4, 2024
SUPER: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ‘చరిత్ర’ తెలుస్తుంది!

చారిత్రక కట్టడాల వివరాలు ప్రజలకు తెలిసేలా కేంద్ర పురావస్తుశాఖ ఆయా నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేస్తోంది. వరంగల్(D) ఖిలా వరంగల్లోనూ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ కోడ్ను ఫోన్లో స్కాన్ చేస్తే తెలుగు, హిందీ, ఇంగ్లిష్లో కాకతీయుల చరిత్ర, ఆలయాల విశేషాలు, పురాతన కట్టడాల గురించి చూపిస్తుంది. జిల్లాల పర్యాటక ప్రాంతాల వివరాలు, గూగుల్ మ్యాప్ లొకేషన్ వంటివి తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.
Similar News
News November 25, 2025
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మరోవైపు మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో NOV 29 నుంచి DEC 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
News November 25, 2025
ఆంధ్ర అరటికి.. ఆజాద్పుర్ మండీ వ్యాపారుల హామీ

AP: అరటి ధర పతనంతో కొందరు రైతులు పండిన పంటను చెట్లకే వదిలేశారు. మరి కొందరు పశువులకు మేతగా వేశారు. ఈ తరుణంలో AP నుంచి నాణ్యమైన అరటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీలోని ఆజాద్పుర్ మండీ పండ్ల వ్యాపారులు హామీ ఇచ్చారు. AP అధికారులు నిన్న ఢిల్లీలో ‘బయ్యర్ సెల్లర్స్ మీట్’ నిర్వహించి అక్కడి వ్యాపారులతో చర్చించగా.. 10-15 రోజుల్లో AP నుంచి అరటిని కొంటామని ఆజాద్పుర్ మండీ వ్యాపారులు హామీ ఇచ్చారు.
News November 25, 2025
ICAR-IIMRలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని ICAR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్లో 5 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్స్, ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ ), PhD, PG( అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://www.millets.res.in/


