News March 24, 2025
మహిళలకు సూపర్ స్కీమ్.. నెలాఖరు వరకే గడువు

భారత మహిళలకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోస్టాఫీస్ సేవింగ్స్ పథకం MSSC. రూ.1000 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో కలిపి మొత్తం తీసుకోవచ్చు. అత్యవసరమైనప్పుడు డిపాజిట్‌లో 40శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫామ్ లభిస్తుంది. ఈ నెలాఖరుకే పథకం ఆగిపోనుంది. మరిన్ని వివరాలకు సమీప పోస్టాఫీసును సంప్రదించవచ్చు. షేర్ చేయండి.
Similar News
News November 11, 2025
అల్-ఫలాహ్ యూనివర్సిటీ.. లింకులన్నీ ఇక్కడి నుంచే!

ఢిల్లీలో పేలుడు ఘటనతో హరియాణా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ, హాస్పిటల్ వార్తల్లోకెక్కింది. ఇక్కడ 40% డాక్టర్లు కశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు. లోకల్ డాక్టర్లు, విద్యార్థులను కాకుండా ఎక్కువ మంది కశ్మీర్ ప్రాంతానికి చెందినవారిని తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. జైషే మహమ్మద్‌తో సంబంధం ఉన్న ముజామిల్, షాహిన్, నిన్న పేలుడు సమయంలో కారు నడిపిన డాక్టర్ ఉమర్ ఇక్కడి వారే కావడం గమనార్హం.
News November 11, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రూ.202.93 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా ఈ వారం 18,247 మంది లబ్ధిదారులకు నగదు జమ అయినట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, మొత్తం రూ.2,900 కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు.
News November 11, 2025
బిహార్, జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్

బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు TGలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. బిహార్‌లో ఈనెల 6న 121 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగగా 65.08% పోలింగ్ నమోదైంది. ఇవాళ 122 స్థానాలకు సా.5 గంటల వరకు 67.14% ఓటింగ్ రికార్డయింది. జూబ్లీహిల్స్‌లో సా.5 గంటల వరకు 47.16% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినా సా.6లోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు.


