News August 15, 2025
సూపర్ సిక్స్ హామీలు.. సూపర్ హిట్టేనా?

AP: ‘సూపర్ సిక్స్ హామీలు’ సూపర్ హిట్ అయ్యాయని CM చంద్రబాబు అన్నారు. <<17416088>>ఫ్రీ బస్సు<<>>, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ తదితర హామీలు నెరవేర్చామని చెప్పారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 హామీలు అమలు కావాల్సి ఉంది. మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం గురించి లబ్ధిదారులే ప్రచారం చేయాలని CM కోరారు. ఆయన చెప్పినట్లు ‘సూపర్ 6’ సూపర్ హిట్ అయ్యాయా? మీ COMMENT.
Similar News
News August 16, 2025
రజినీకాంత్‌కు మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు

సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీది ఒక ఐకానిక్ జర్నీ. ఎన్నో జనరేషన్స్‌ను మీ విభిన్న పాత్రలతో అలరించారు. మీ ప్రయాణం ఇంతే విజయవంతంగా కొనసాగాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘నటుడిగా అలరించడమే కాకుండా.. మీ చిత్రాలతో సమాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు’ అని సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
News August 16, 2025
మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా అక్కడ బంద్‌కు పిలుపు

TG: మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. నార్త్ ఇండియా నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మార్వాడీలు అన్ని వ్యాపారాలకు విస్తరిస్తున్నారని, వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తుండటంతో స్థానికులకు ఉపాధి లభించట్లేదంటున్నారు. ఈ నేపథ్యంలో AUG 18న రంగారెడ్డి(D) ఆమనగల్లు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు లోకల్ వ్యాపారులు ప్రకటించారు.
News August 15, 2025
PHOTO GALLERY: రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’

AP: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందులో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతులు పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్, మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.