News January 28, 2025
సూపర్ సిక్స్ పథకాలు బొక్క బోర్లా: YCP

AP: సూపర్ సిక్స్ పథకాలు బొక్క బోర్లా పడ్డాయని వైసీపీ ఆరోపించింది. ఎలాగైనా చేస్తారని నమ్మి ఓట్లేశాం కదా అనే ఫీలింగ్‌లోకి జనం వెళ్తున్నారని పేర్కొంది. అందుకే CM చంద్రబాబు వాస్తవాల పేరిట చావు కబురు చల్లగా చెప్పారని తెలిపింది. సంపద సృష్టించి ఇంటింటికీ పంచుతానన్న చంద్రబాబు డబ్బుల్లేవని నాటకాలు ఆడుతున్నారని మండిపడింది. ఇలాంటి వారికి ఒళ్లంతా వాతలు పెట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని వివరించింది.
Similar News
News November 19, 2025
యువత 20 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలి: శ్రీధర్

యువత పెళ్లి కంటే కెరీర్‌పై ఫోకస్ చేయడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాకు సంకేతమన్న ఉపాసన <<18317940>>వ్యాఖ్యలపై<<>> ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. యువ వ్యాపారవేత్తలు, స్త్రీ, పురుషులు 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని తాను సూచిస్తానన్నారు. ‘సమాజానికి జనాభాను అందించే డ్యూటీని యువత నిర్వర్తించాలి. ఆ ఆలోచనలు విచిత్రంగా, పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. కానీ కాలక్రమంలో అందరూ దీన్నే అనుసరిస్తారు’ అని పేర్కొన్నారు.
News November 19, 2025
రెండేళ్లుగా కూతురిని ఇంట్లోనే బంధించిన తల్లి.. ఎందుకంటే?

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన బాలిక 9వ తరగతి వరకు చదువుకుంది. రజస్వల అయిన తర్వాత “బయట ప్రపంచం ప్రమాదం” అనే భయంతో రెండేళ్ల పాటు తల్లి భాగ్యలక్ష్మి ఆమెను ఇంటికే పరిమితం చేసింది. భర్త మృతితో ఒంటరిగా మారిన తల్లి తన భయాలను కుమార్తెకు రుద్దింది. అధికారులు జోక్యం చేసుకొని తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని KGHకు, మౌనికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.
News November 19, 2025
రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’పై వివాదం!

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాపై వివాదం మొదలైంది. సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే టైటిల్‌ను రెండేళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్‌ను SSMB29 టీమ్ ఉపయోగించడంతో ఆయన TFPCలో ఫిర్యాదు చేశారు. అయితే రాజమౌళి తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే గ్లింప్స్‌లోనూ మూవీ టైటిల్‌ను తెలుగులో ఇవ్వలేదని సమాచారం. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.


