News August 5, 2024

రీరిలీజ్‌లో సూపర్‌స్టార్ ‘మురారి’ రికార్డులు

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 9న మురారి సినిమాను 4Kలో రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ సినిమా పలు రికార్డుల్ని సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో అడ్వాన్స్ సేల్స్‌లో అత్యంత వేగంగా రూ.50 లక్షల కలెక్షన్లు సాధించడంతో పాటు బుక్‌మైషోలో 24 గంటల్లో 40.01 వేల టికెట్ల బుకింగ్స్‌తో ‘బిజినెస్‌మ్యాన్’ రికార్డును తిరగరాసింది. సుదర్శన్ 35MMలో రిలీజ్ రోజుకు ఒక్క టికెట్టూ మిగలలేదు.

Similar News

News December 8, 2025

వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

image

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News December 8, 2025

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

image

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్‌‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్‌లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.

News December 8, 2025

NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌లో 5 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల వారు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి BE, B.tech, PG(అగ్రి బిజినెస్), M.COM, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.